ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా మాస్టర్ తరుణ్ అందరికీ సుపరిచితుడు. తరుణ్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. హీరో అయ్యాక తొలి సినిమా 'నువ్వే కావాలి' అప్పట్లో ఓ సంచలనం. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసింది అప్పట్లో ఈ సినిమా. అయితే ఆ తర్వాత ఒకటి అరా, తప్ప పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోయాడు తరుణ్. పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నాడు. ఈ మధ్య తరుణ్ సినిమాల్లో కనిపించడం లేదు. అయితే చాలా కాలం తర్వాత తరుణ్ 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ తెర పైకి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. కింగ్ నాగార్జున ఈ టీజర్‌ని విడుదల చేశారు. చాలా కాలం తర్వాత తరుణ్ నుండి వస్తోన్న సినిమా ఇది. ఒకప్పుడు లవ్స్టోరీస్కి తరుణ్ పెట్టింది పేరు. లవర్ బోయ్‌గా తరుణ్‌కి చాలా ఫాలోయింగ్ ఉంది. తాజాగా సినిమా కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీనే. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ టీజర్‌కి. తనకున్న లవర్ బోయ్ ఇమేజ్‌ని ఈ సినిమాతో కొనసాగించాలనుకుంటున్నాడట తరుణ్. ఈ సినిమాలో తరుణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ లేనంత మేకోవర్ వచ్చింది తరుణ్‌లో. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఫుల్ గెడ్డంతో కొన్ని సీన్స్‌లోనూ, గెడ్డం లేకుండా కొన్ని సీన్స్‌లోనూ కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాతో తరుణ్ మళ్లీ ఏదో మ్యాజిక్ చేయనున్నాడని తెలియవస్తోంది టీజర్ చూస్తుంటే, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తరుణ్‌కి జంటగా కొత్త భామ ఒవియా నటిస్తోంది.