సిట్ విచారణ లో పాల్గొన్న హీరో తరుణ్ సుమారుగా 13 గంటలపాటు సిట్ అధికారుల ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు.
మొదటిరోజు పూరి జగన్నాధ్ ని 11గంటల పాటు విచారించిన అనంతరం ఆయన నుండి బ్లడ్, వెంట్రుకలు, గోళ్ళు శాంపిల్స్ ఎలాగైతే తీసుకున్నారో నిన్న కూడా తరుణ్ నుండి అలాంటి శాంపిల్స్ తీసుకున్నారు. ఇక విచారాణ ముగిశాక తరుణ్ మీడియా తో మాట్లాడుతూ- సిట్ అధికారుల ప్రశ్నలకి తాను సమాధానం చెప్పినట్టు అలాగే తన సమాధానాలతో వారు సంతృప్తి చెంది ఉంటారు అని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. అయితే ఈ డ్రగ్స్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీ ఏ కాకుండా చాలా రంగాల్లో ఉంది అని వాటిని రూపుమాపేందుకు అందరం కలిసి రావాలని చెప్పి వెళ్ళిపోయాడు.
మీడియా పాయింట్ దగ్గర తాను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయాడు, మీడియా వారిని ప్రశ్నలు అడిగే సమయం ఇవ్వలేదు. ఇక విచారణ అధికారులు మాట్లాడుతూ- శాంపిల్స్ సేకరించామని, తరుణ్ సహకరించాడు అని అలాగే సోమవారం నాడు హరో నవదీప్ విచారణకి హాజరుకానున్నాడని స్పష్టం చేశారు.