మాతృత్వం గొప్ప అనుభూతి. గర్భంలో నవమాసాలు పెంచిన శిశువుని తల్లి తన చేతిలోకి తీసుకుని ముద్దాడినప్పుడు కలిగే అనుభూతి మాటలకందనిది. అమ్మతనం గొప్పవరం. అయితే ఈ వరాన్ని కృత్రిమ మార్గాల్లో పొందే అవకాశం కూడా కల్పించింది సైన్స్. సరోగసి పద్దతితో కుత్రిమ మార్గాల్లో తల్లితండ్రులుగా మారుతున్న సెలబ్రిటీలు బోలెడుమంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సరోగసి పేరెంట్స్ చాలా మంది వున్నారు. షారుక్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, శిల్పా శెట్టి.. ఇలా బోలెడు మంది. ఇప్పుడు ఈ లిస్టు లో ప్రియాంక చోప్రా కూడా చేరింది. సరోగసి ద్వారా తమకు పాట పుట్టిందని, మాతృత్వం మాధుర్యాన్ని ఆశ్వాదిస్తున్నాన్ని పోస్ట్ పెట్టింది ప్రియాంక. అయితే ఈ పోస్ట్ పై సామాజిక కార్యకర్త, రచయిత్రి తస్లీమా నస్రీన్ చేసిన కామెంట్ వివాదాస్పదమైయింది.
ప్రియాంక పేరు ప్రస్తావించకుండా ''సరోగసీ విధానంలో రెడీమేడ్ బేబీలను పొందుతున్నప్పుడు ఇటువంటి తల్లులు ఎలా ఫీలవుతారు? తమ బిడ్డను స్వయంగా కన్న తల్లులకు మాదిరే భావాలు వీరిలోనూ ఉంటాయా?'' అని ప్రశ్నించింది. ఇంకో ట్వీట్ చేస్తూ ''ధనవంతులు ఎప్పుడూ తమ స్వార్థం కోసం సమాజంలో పేదరికం ఉండాలని కోరుకుంటారు. బిడ్డను పెంచాలనే కోరిక మీకు నిజంగా ఉంటే, నిరాశ్రయులైన బిడ్డను దత్తత తీసుకోండి. మీరు పిల్లలలో పితృ లక్షణాలు కలిగి ఉండాలి. ఇది మీ అహం తప్ప మరేమీ కాదు. ధనవంతులైన మహిళలు సరోగసీ తల్లులుగా మారే వరకు నేను సరోగసీని అంగీకరించను’ అని రాసుకొచ్చింది తస్లీమా.