వైష్ణవ్ తేజ్ జోరుమీదున్నాడు. ఉప్పెన తర్వాత వెంటనే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమా కూడా సిద్దమైయింది. గిరిశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేశారు.
చిత్రానికి ‘రంగరంగ వైభవంగా’అనే పేరు ఖారారు చేశారు. టైటిల్ టీజర్ ఆసక్తికరంగా వుంది. ‘‘ఏంటే ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్?’’ అని వైష్ణవ్ ప్రశ్నించగా.. ‘‘అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు. నీకు బటర్‌ఫ్లై కిస్ తెలుసా’’ అంటూ కేతికాశర్మ తన కనురెప్పలతో వైష్ణవ్ కనురెప్పలను ముద్దాడినట్లు టీజర్ వీడియోలో చూపించారు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అర్జున్ రెడ్డి చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు గిరిశయ్య. తమిళ్ లో ఇదే సినిమాని రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు. ఇప్పుడిది ఆయనకి రెండో సినిమా. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.