'టాక్సీవాలా'కి అది వర్కవుటయ్యిందిలే.!

మరిన్ని వార్తలు

రిలీజ్‌కి ముందే డిజిటల్‌ ప్రింట్‌ పైరసీ వీడియో బయటికి వచ్చేసింది. దాంతో కష్టపడి సినిమా తీసిన చిత్రయూనిట్‌ బాధా వర్ణనాతీతమైంది. ఇదంతా ఏ సినిమా కోసం మాట్లాడుకుకుంటున్నామో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయ్‌ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌నే తెచ్చుకుంటోంది. ఫైనల్‌ రిజల్ట్‌ సాయంత్రంలోగా తెలుస్తుందనుకోండి. 

ఇకపోతే ఈ సినిమా రిలీజ్‌కి ముందే లీకవ్వడంతొ ఇండస్ట్రీ మొత్తం ఆందోళన చెందింది. దాంతో అందరూ ఈ సినిమాకి సపోర్ట్‌గా నిలిచారు. చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రబాస్‌ తదితర స్టార్‌ హీరోలు, నిఖిల్‌ తదితర యంగ్‌ హీరోలు కూడా ఈ సినిమాకి బెస్ట్‌ సపోర్ట్‌గా నిలిచారు. ధియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడాలని అభిమానులకు సూచించారు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. 

ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి. టాక్‌ కూడా ఫర్వాలేదనిపించడంతో స్టార్స్‌ సపోర్ట్‌ ఈ సినిమాకి బాగానే కలిసొచ్చిందంటున్నారు. తన సినిమాకి ఇంతలా సపోర్ట్‌ అయినందుకు విజయ్‌ దేవరకొండ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాడు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. 

ఏదేమైతేనేం మొత్తానికి, 'నోటా'తో డీలా పడిన విజయ్‌దేవరకొండ 'టాక్సీవాలా'తోె ఎలాగోలా గట్టెక్కేశాడనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS