'పంతం'కి అలా కలిసొచ్చేసింది

By iQlikMovies - July 07, 2018 - 13:11 PM IST

మరిన్ని వార్తలు

గోపీచంద్‌, మెహ్రీన్‌కౌర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పంతం' సినిమాకి నెగెటివ్‌ టాక్‌ వచ్చింది విడుదల రోజున. అయితే, వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి. గోపీచంద్‌ కెరీర్‌లోనే ఓపెనింగ్స్‌ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది 'పంతం'. అయితే, ఆ మరుసటి రోజే వచ్చిన 'తేజ్‌ ఐ లవ్‌ యూ' సినిమా ఎఫెక్ట్‌ 'పంతం' సినిమా మీద బాగా పడుతుందని అంతా అనుకున్నారు. 

కానీ 'తేజ్‌ ఐ లవ్‌ యూ' కూడా నిరాశపర్చింది. 'తేజ్‌' నిరాశపర్చడంతో, 'పంతం' సినిమాపై నెగెటివిటీ తగ్గింది. తద్వారా రెండో రోజు సాయంత్రానికే 'పంతం' సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో క్రౌడ్‌ పెరగడం స్టార్ట్‌ అయ్యిందట. అలా 'పంతం' సినిమాకి భలేగా కలిసొచ్చేసిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ట్రేడ్‌ పండితులే ఆశ్చర్యపోయేలా పుంజుకుంటున్న 'పంతం', హిట్‌ జోన్‌లోకి వెళ్ళిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది. 

సోమవారానికే 'పంతం' సేఫ్‌ జోన్‌లో వుంటుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నా, మరికొందరు మాత్రం అంత సీన్‌ లేదని అంటున్నారు. ఏదేమైనా గోపీచంద్‌ కాస్త కోలుకున్నట్లయ్యింది 'పంతం' సినిమాతో. ఇంకోపక్క 'తేజ్‌ ఐ లవ్‌ యూ' సినిమాతో కోలుకుందామనుకున్న సాయిధరమ్‌ తేజకి మరోసారి నిరాశే ఎదురయ్యింది. కరుణాకరన్‌ సైతం సాయిధరమ్‌ తేజని గట్టెక్కించలేకపోయాడు. లవ్‌ స్టోరీని కొత్తగా ట్రై చేసిన క్రెడిట్‌ సాయిధరమ్‌ తేజకి సరిపోదు. 

'సుప్రీం' లాంటి హిట్‌ మళ్ళీ తేజుకి ఎప్పుడొస్తుందో ఏమోగానీ, ఈ మెగా హీరో ఈ మధ్య కెరీర్‌లో దారుణమైన డౌన్‌ఫాల్‌ని ఎదుర్కోవాల్సి వస్తుండడం శోచనీయం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS