పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్ ప్రేమించి, పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఈ ఇద్దరూ చాలాకాలం సహజీవనం కూడా చేశారు. 'సమాజంతో మాకేంటి పని, మా ఇద్దరి మధ్యా అంతటి అవగాహన వుంది' అని గట్టిగా నమ్మిన ఈ జంట, విడిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
రేణుదేశాయ్, పవన్‌ని భరించలేక విడాకులు తీసుకుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ క్రమంలో రేణుదేశాయ్, పవన్ నుంచి భారీ మొత్తం ఆశించిందనీ, కోరుకున్న మొత్తాన్ని పవన్ నుంచి తీసుకెళ్ళిందని కూడా అనుకున్నారు. కానీ, అదంతా ఉత్తదేనని చాలా సందర్భాల్లో రేణుదేశాయ్ వివరణ ఇచ్చింది. తాజాగా ఆ విడాకుల ఎపిసోడ్ గురించి స్పందించిన రేణుదేశాయ్, పవన్‌కళ్యాణ్ విడాకులు కావాలని అడిగారనీ, దాంతో తాను ఒప్పుకోక తప్పలేదని చెప్పింది. 'ఎవరు ముందు విడాకులు కోరుకన్నారు?' అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇన్నాళ్ళూ దాటవేశాను, ఇప్పుడు నిజం చెప్పాల్సిన సందర్భం వచ్చింది, నిజం చెబుతున్నాను.. అని పవన్, విడాకులు కోరిన విషయాన్ని బయటపెట్టింది.
పవన్, రేణు జంటకు అకిరానందన్, ఆద్య జన్మించిన సంగతి తెల్సిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు తల్లి రేణుదేశాయ్ దగ్గరే వున్నారు. రేణుదేశాయ్‌తో విడాకుల తర్వాత పవన్, రష్యన్ మహిళ అన్నా లెజ్‌నెవాను పెళ్ళాడారు. పవన్ - అన్నా లెజ్‌నెవాలకు ఇద్దరు సంతానం. ఇటీవలే రేణు, మరో వ్యక్తితో పెళ్ళికి సిద్ధమయ్యింది. ఈ ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా ఈ మధ్యనే జరిగింది.