'తేజ్‌': ఇట్స్‌ ఎ కూల్‌ అండ్‌ లవ్‌లీ టీజర్‌

By iQlikMovies - May 01, 2018 - 17:49 PM IST

మరిన్ని వార్తలు

కూల్‌ రెయిన్‌లో గాళ్‌ ఫ్రెండ్‌తో కలిసి హాట్‌ కాఫీ తాగుతూ, రొమాంటిక్‌ ఫీల్‌ ఇస్తున్నాడు సాయి ధరమ్‌తేజ్‌. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌ యూ'. కరుణాకరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుపమా పరమేశ్వరన్‌, తేజుకి జోడీగా నటిస్తోంది. 

తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 'ఫస్ట్‌ ఫీల్‌' అంటూ విడుదలైన ఈ టీజర్‌ నిజంగానే మంచి ఫీల్‌ ఉంది. పైన వర్షం, బస్‌స్టాప్‌లో ఓ కుర్రాడు. చేతిలో హాట్‌ కాఫీ, గాళ్‌ ఫ్రెండ్‌తో వెచ్చని కౌగిలి.. ఇది ఈ టీజర్‌ అయితే ఇది నిజం కాదు, ఆ కుర్రోడి స్వీట్‌ స్వీటర్‌ అండ్‌ స్వీటెస్ట్‌ డ్రీమ్‌.. ఫస్ట్‌ ఫీల్‌ అదిరిందిగా. లవ్‌స్టోరీస్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన కరుణాకరన్‌ ఇలాంటి రొమాంటిక్‌ సీన్స్‌ తీయడంలో దిట్ట.

 

అప్పుడెప్పుడో పవన్‌ కళ్యాణ్‌తో 'తొలిప్రేమ' సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమాలోని రొమాంటిక్‌ ఫీల్‌ ఇంకా ఇప్పటికీ కుర్రకారును వెంటాడుతూనే ఉంటుంది. ఎన్ని రొమాంటిక్‌ సీన్స్‌ వచ్చినా ఆ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, కీర్తి రెడ్డి మధ్య జరిగే లవ్‌ ట్రాక్‌ ఫీలే వేరు. అలాంటి ఫీల్‌ని మళ్లీ కరుణాకరన్‌, తేజు అండ్‌ అనుపమా పరమేశ్వరన్‌ పెయిర్‌లో చూపించి, మెస్మరైజ్‌ చేయనున్నాడనీ ఈ ఫస్ట్‌ ఫీల్‌ ద్వారా తెలుస్తోంది. పక్కా రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కరుణాకరన్‌. 

ఇటీవల 'జవాన్‌', 'ఇంటెలిజెంట్‌' వంటి సినిమాలతో వరుస ఫెయిల్యూర్స్‌ని అందుకున్న తేజు, ఈ సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కుతాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS