విజయ్‌ స్పెషల్‌ డ్రీమ్‌ బిహైండ్‌ 'టేక్సీవాలా'

మరిన్ని వార్తలు

'పెళ్లిచూపులు' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, 'అర్జున్‌రెడ్డి'తో తిరుగులేని స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడిప్పుడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క స్పెషల్‌ రోల్స్‌తోనూ పండగ చేసుకుంటున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే, విజయ్‌ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకి ప్రమోషన్‌ అనాలో, లేక విజయ్‌ దేవరకొండ ఫన్నీగా చేశాడనుకోవాలో తెలీదు కానీ, విజయ్‌ దేవరకొండ 'టేక్సీవాలా' కథని ఎంచుకునేందుకు రీజన్‌ ఏంటంటే, ఆయనకి ఓ కల వచ్చిందట. ఆ కలలో నలుగురు పిల్లలు విజయ్‌ దేవరకొండని టీజ్‌ చేస్తారు. ఆ వీడియో డీటెయిల్స్‌ కావాలంటే విజయ్‌ ట్విట్టర్‌లో వీడియో ఉంది, దర్జాగా కూర్చొని చూసెయ్యండి. 'అర్జున్‌రెడ్డి' సినిమా అడల్ట్‌ కంటెన్ట్‌ మూవీ. సో పిల్లలు ఆ సినిమాని చూడకూడదు. కానీ పిల్లల్లో అర్జున్‌రెడ్డికి అదే మన విజయ్‌ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్‌కి అలాంటి సినిమాలు చేస్తే కుదరదు కదా. అందుకే 'టాక్సీవాలా' లాంటి సినిమాలు కూడా ఎంచుకోవాలి. (పిల్లల కోసం) ఆ స్కిప్ట్‌ అలాగే ఓకే చేశాడట. 

ఈ సినిమా స్క్రిప్ట్‌ ఓకే చేయడానికి ముందు తనకి వచ్చిన కలని ఇలా వీడియో ద్వారా చూపించాడు విజయ్‌. వీడియో అయితే భలే ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉందిలెండి. ఇకపోతే ఈ సినిమా కాక విజయ్‌ దేవరకొండ 'నోటా' అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న 'మహానటి'లోనూ విజయ్‌ దేవరకొండ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS