తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. రానా హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మామూలుగా తేజ డైరెక్షన్‌లో సినిమాలంటే హీరోని చాలా అమాయకంగా చూపిస్తాడు. విలన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. విలన్ చేతిలో హీరో చావ దెబ్బలు తినడమే గుర్తొస్తుంది. కానీ ఈ సినిమా వాటిన్నింటికీ భిన్నంగా ఉంది. ఈ సినిమాలో హీరో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. హీరోలోనే నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అందుకే తేజ అంటున్నాడు. తాను రూటు మార్చాననీ, ఈ సినిమాలో హీరో రానాని అస్సలు కొట్టలేదనీ అంటున్నాడు. మరో పక్క రానా చెబుతున్న డైలాగులు అదరగొట్టేస్తున్నాయి. ప్రోమోస్‌లోని డైలాగ్సే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమాలో ఉతికి ఆరేసి ఉంటాడు రానా తన డైలాగులతో అని అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా. జోగేంద్ర పాత్రలో రానా పంచెట్టుతో అలరిస్తున్నాడు. ముద్దుగుమ్మ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ముద్దుగుమ్మ కేథరీన్ కీలక పాత్రలో కనిపించనుంది. పాటలు, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్ అన్నీ చాలా కొత్తగా ఉండబోతున్నాయి ఈ సినిమాలో. తేజ నుండి వస్తోన్న డిఫరెంట్ జోనర్ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' అని చెప్పొచ్చు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.