ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన.. బాల నటుడు గుర్తున్నాడా? చాలా సినిమాల్లో బాల నటుడిగా కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనే.. తేజ. ఇటీవల `ఓబేబీ`లో కీలక పాత్ర పోషించి, మెప్పించాడు. ఇప్పుడు.. హీరోగా ఇంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `జాంబీ రెడ్డి`లో తేజనే హీరో. ఇప్పటి వరకూ హీరో ఎవరన్నది రివీల్ చేయలేదు. ఈరోజు.. తేజ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా.. తేజ ఫస్ట్ లుక్ కి రివీల్ చేశారు. మరోవైపు.. మహాతేజ క్రియేషన్స్ నిర్మించే మరో సినిమాలోనూ.... తేజనే హీరో. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివానీ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు.. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మనే కథ అందించడం విశేషం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయిని చిత్రబృందం తెలిపింది.