తెలుగునాట బయోపిక్స్ హవా నడుస్తున్న వేళ, కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న హీరో ఉదయ్ కిరణ్ పైన ఒక బయోపిక్ రానుంది అన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తాడు అన్న వార్తలు ఇంకా ఈ అంశాన్ని హైలైట్ చేశాయి.
అయితే ఈ వార్తల పై దర్శకుడు తేజ స్పందించడమే కాకుండా తన తదుపరి చిత్రాల వివరాలు కూడా చెప్పాడు. ఇక ఉదయ్ కిరణ్ బయోపిక్ విషయానికి వస్తే, తాను ఎటువంటి బయోపిక్ చేయడం లేదు అని, ఉదయ్ కిరణ్ సినిమా అనేది కేవలం ఒక పుకారు మాత్రమే అని తేల్చి చెప్పాడు.
అలాగే తాను ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఒక చిత్రం చేస్తున్నాను అని ఆ తరువాత హీరో రానా తో చేస్తాను అని క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి ఉదయ్ కిరణ్ పైన తాను ఎటువంటి చిత్రం చెయ్యట్లేదు అన్న తేజ మాటతో ఈ ఎపిసోడ్ ముగిసింది అని అనుకోవచ్చు.
ఇకనైనా.. ఈ పుకార్లకిబ్రేక్ పడుతుందా లేదా అని చూడాలి.