ప్రముఖ రచయిత-దర్శకుడు రాజసింహ నిన్నటిరోజున ఆత్మహత్యకి పాల్పడినట్టుగా వార్తలు రావడం, అపస్మారక స్థితిలో ఆయన ఉన్న ఫోటో కూడా అంతర్జాలంలో హల్చల్ చేసింది.
అయితే రాజసింహ ఈ ఆత్మహత్య గురించి స్పందించాడు. అయితే ఈ మొత్తం అంశంలో అసలు తాను ఆత్మహత్యకి పాల్పడలేదు అని చెప్పాడు. తనకి మధుమేహం ఉందని, నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో తన షుగర్ లెవల్స్ పడిపోవడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత తనని తన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఇక దయచేసి ఈ ఆత్మహత్య వదంతులు నమ్మవద్దని తానే స్వయంగా హైదరాబాద్ కి ఇంకొక రెండు మూడు రోజుల్లో వస్తున్నాను, వచ్చాక అన్ని వివరాలు చెబుతాను అని వివరించాడు.
ఏదేమైనా.. నిన్నటి వార్త మాత్రం అందరిని ఒక్కసారిగా ఉల్లిక్కి పడేలా చేసింది.