తేజ వెంకీ ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టేశాడా?

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుండి డైరెక్టర్‌ తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే అభిమానుల్లో చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాల్ని అందుకోవడం సాధ్యం కాదనే తేజ ఈ ప్రాజెక్ట్‌ నుండి తొలుతలోనే తప్పించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత తేజ ఏం సినిమా చేయబోతున్నాడనే అంశంపై ఆసక్తి మొదలైంది. 

గతంలోనే తేజ - వెంకీ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ప్లాన్‌ చేశారు. అయితే ఎన్టీఆర్‌ బయోపిక్‌ తేజ చేతికి చిక్కడంతో ఆ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టేశాడనీ టాక్‌ వినిపించింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ పక్కకెళ్లడంతో, వెంకీ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే యోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నాడట తేజ. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. శ్రియ ఈ సినిమాలో వెంకీతో జోడీ కడుతోంది. 

మరోపక్క 'నేనే రాజు నేనే మంత్రి'తో సూపర్‌ హిట్‌ కొట్టిన రానాతో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించడానికి తేజ స్క్రిప్టు ప్రిపేర్‌ చేశాడట. ఆ సినిమా కూడా త్వరలోనే లైన్‌లో పెట్టనున్నాడట. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుండి రివీలయ్యాక తేజ జోరు పెంచాడని తెలుస్తోంది. మరోవైపు తేజ, హీరో ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌ని తెరకెక్కిస్తాడంటూ గాసిప్స్‌ బాగా వినిపించాయి ఈ మధ్య.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS