నాగార్జున - రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఆఫీసర్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. కానీ జూన్ 1కి వాయిదా పడింది. టెక్నికల్ రీజన్స్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైందని చిత్ర యూనిట్ ప్రకపటించినప్పటికీ, అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు కొన్ని లీగల్ చిక్కులున్నాయట.
వాటిని దాటుకుని సినిమా ఎలా రిలీజవుతుందనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ఓ నిర్మాణ సంస్థకు రామ్‌గోపాల్ వర్మ కోటి రూపాయలు చెల్లించాల్సి ఉందట. ఆ విషయమై సదరు నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. వర్మ సొంత నిర్మాణ సంస్థ అయిన కంపెనీ తరపున ఆ సంస్థకి బాకీ ఉన్నాడనీ తెలుస్తోంది. ఇప్పుడా వివాదం కోర్టులో సెటిలైతే కానీ, సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదట. దాంతో ఈ మేటర్ సెటిలవ్వాలంటే నాగార్జున రంగంలోకి దిగాలని తెలుస్తోంది.
అయితే ఈ వివాదంలోకి నాగార్జున దూరతాడా? ఒకవేళ నాగార్జున కల్పించుకోకపోతే 'ఆఫీసర్' పరిస్థితేంటి? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలే నాగార్జునకూ, వర్మకూ 'ఆఫీసర్' ప్రెస్టీజ్ ఇష్యూ మూవీ. అసలే ఫ్లాపుల్లో ఉన్న వర్మపై ఎంతో నమ్మకంతో నాగార్జున ఈ సినిమాకి ఒప్పుకున్నాడు. అలాంటిది ఇప్పుడీ సినిమా రిలీజ్ కాకుంటే, ఈ కాంబినేషన్‌కి గతంలో ఉన్న ట్రాక్ రికార్డుకు మచ్చ వాటిల్లే అవకాశముంది.
సో చూడాలిక ఏం జరుగుతుందో.!