తేజ మళ్లీ చందమామకే గాలమేస్తున్నాడా.?

By Inkmantra - February 26, 2020 - 08:36 AM IST

మరిన్ని వార్తలు

రెండు సినిమాలను ఎట్‌ ఏ టైమ్‌ టైటిల్స్‌తో సహా అనౌన్స్‌ చేసి, డైరెక్టర్‌ తేజ షాకిచ్చిన సంగతి తెలిసిందే. హీరో గోపీచంద్‌తో ‘అలిమేలుమంగ వేంకటరమణ’, రానాతో ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్స్‌ రీసెంట్‌గా తేజ అనౌన్స్‌ చేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్స్‌ ఎవరు.? అనే చర్చ ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. ఒక సినిమాలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ని తీసుకునే యోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. అది రానాతో తెరకెక్కించబోయే సినిమా అని మాట్లాడుకుంటున్నారు.

 

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో, కాజల్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ, ఇటీవల ఆమెతో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. వీటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. కానీ, ‘సీత’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. సో హిట్‌ కాంబినేషన్‌ అయిన రానా ` కాజల్‌ పెయిర్‌ని తేజ తన సినిమా కోసం మళ్లీ రిపీట్‌ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం కాజల్‌ ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తోంది. మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్‌ ఫస్ట్‌లుక్‌ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్‌ అందుకుంది. అలాగే ‘కాల్‌ సెంటర్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇవి తప్ప ప్రస్తుతం కాజల్‌ చేతిలో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులేమీ లేకపోవడంతో, తేజ ఆఫర్‌ చేస్తే, రానాతో రెండోసారి జోడీ కట్టేందుకు కాజల్‌ వెనుకాడకపోవచ్చు. చూడాలి మరి, ఒకవేళ ఈ కాంబో సెట్‌ అయితే, రానా ` కాజల్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సెకండ్‌ టైమ్‌ కూడా వర్కవుటవుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS