'నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే :  తేజ‌స్వి షాకింగ్ కామెంట్స్

By Inkmantra - June 13, 2020 - 14:10 PM IST

మరిన్ని వార్తలు

కాస్టింగ్ కౌచ్.. ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. కానీ దీనిపై క‌థానాయిక‌లు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. కాబ‌ట్టే... దానిపై అవ‌గాహ‌న‌, చర్చ మొద‌ల‌య్యాయి, 'నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే' అని న‌టి తేజ‌స్వి వాపోయింది. త‌న‌ని చాలామంది నేరుగా `బెడ్ రూమ్‌కి వ‌స్తావా` అని అడిగార‌ని, తాను ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే చాలా అవ‌కాశాల్ని కోల్పోయాన‌ని చెప్పుకొచ్చింది. దాదాపు క‌థానాయిక‌లంద‌రికీ ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయ‌ని, కానీ ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ధైర్యం చేయ‌ర‌ని, అలా చెప్తే, మ‌రింత చుల‌క‌న‌గా చూస్తార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది తేజ‌స్విని.

 

ముంబై నుంచి వ‌చ్చిన క‌థానాయిక‌ల్లో చాలామంది `అన్నింటికీ` ఒప్పుకుంటారని‌, అందుకే వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో మ‌న నిర్మాత‌లు ఎగ‌బ‌డ‌తార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. దాదాపు 90 శాతం అమ్మాయిల‌కు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర‌వుతాయ‌ని, ఈ చెత్త‌నంతా దాటుకెళ్తేనే, ప‌రిశ్ర‌మ‌లోని అస‌లైన వ్య‌క్తులు ప‌రిచ‌యం అవుతార‌ని, వాళ్ల నుంచి అవ‌కాశాలొస్తాయ‌ని, వీట‌న్నింటికీ క‌థానాయిక‌లూ మాన‌సికంగా సిద్ధ‌ప‌డిపోయార‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం `క‌మిట్‌మెంట్‌` అనే ఓసినిమాలో న‌టించింది తేజ‌స్వి. ఆ సినిమాప్ర‌మోష‌న్ల‌లో భాగంగానే `క‌మిట్‌మెంట్ల‌` గురించి ఇలా నోరు విప్పాల్సి వ‌చ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS