ప్రెస్ మీట్ బన్నీ కొంపముంచిందా?

మరిన్ని వార్తలు

పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్య ధియేటర్ కి వెళ్లగా అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందటం తెలిసిందే. ఇదే విషయం పై బన్నీపై కేసు ఫైల్ చేసి చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. తరువాత ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడుతూ బన్నీ తీరుని, బన్నీ అరెస్ట్ ని ఖండించిన వారిని తప్పు పట్టారు. సీవీ ఆనంద్ లాంటి కూల్ అండ్ డైనమిక్ ఆఫీసర్ కూడా నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అని నోరు జారారు. కారణం పోలీసుల వెర్షన్ కరక్ట్ గా ప్రజలకి రీచ్ అవటం లేదని ఆవేశంతో మీడియాపై అసహనానికి గురయ్యారు. ఈక్రమంలోనే బన్నీ శనివారం ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పాటు కమీషనర్ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. తనను వ్యక్తిగతంగా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అంతే కాదు బన్నీ వెర్షన్ లో తాను రోడ్ షో చేయలేదని, ర్యాలీ కూడా చేయలేదని స్పష్టం చేస్తున్నాడు. అసలు రేవతి చనిపోయినట్లు, శ్రీ తేజ్ గాయపడినట్లు తనకి తెలియదని, పోలీసులు పర్మిషన్ ఇచ్చారని, అందుకే తాను షో కి వెళ్లానని, బన్నీ ఈ ప్రెస్ మీట్ లో చెప్పాడు. బన్నీ పెట్టిన ప్రెస్ మీట్ కారణంగానే ఇప్పడు మళ్ళీ విచారణకి పిలిచారని అతని లాయర్లు చెప్తున్నారు. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాల్ని పరిశీలిస్తున్నారని, అంతే కాక సంధ్యా థియేటర్ ఘటన కూడా రీక్రియెట్ చేస్తున్నారని సమాచారం.

మరొక వైపు పోలీసుల వాదన ఏంటంటే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయినట్లు, శ్రీ తేజ్ కొనఊపిరితో ఉన్నట్లు  చెప్పినా బన్నీ థియేటర్ నుంచి వెళ్లలేదని, సినిమా మొత్తం చూసాక వెళ్తానని చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. పరిస్థితి మొత్తం వివరించినా థియేటర్ నుంచి వెళ్తూ కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేసారని పోలీసులు చెబుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS