ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మరిన్ని వార్తలు

కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా  తెలంగాణ రాష్ట్రా  రోడ్లు, భవనాలు మరియు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  గారు.


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2024, హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా" ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును .


ఈ సందర్భంగా  వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా  రోడ్లు, భవనాలు మరియు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కావున ఈ నెల 29న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS