మూర్తన్నకి పోలీస్ భాస్ సాయం!

మరిన్ని వార్తలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కొత్త చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సంక్రాంతి కానుకగా విడుదలయింది. కాగా ఈ చిత్రం విడుదల సమయంలో ధియేటర్ల కొరత తీవ్రంగా ఎదురయింది. అలాంటి ఈ చిత్రానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రూపంలో ఒక పెద్ద బరోసా దొరికింది.

వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ఆ జిల్లా ఎస్పీ తమ జిల్లాలోని హెడ్ కానిస్టేబుల్స్ అందరికీ ఈ చిత్రాన్ని తమ కుటుంబాలతో సహా చూడడానికి ఈరోజు సెలవు ప్రకటించారు. వీరందరి కోసం ఒక ప్రత్యేకమైన షో కూడా వేస్తున్నారట.


ఇది ఒకరకంగా మూర్తన్నకి మరియు చిత్ర యూనిట్ కి ఊపిరి పీల్చుకునే విషయం. మొత్తానికి ఈ చిత్రానికి కావాల్సిన ప్రమోషన్ ఆ ఎస్పీ పుణ్యామా అని ఫ్రీగా దొరికింది.

చూద్దాం మరి.. ఈ అనుకోని ప్రమోషన్ సినిమాకి ఏవిధంగా ఉపయోగ పడుతుందో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS