సీనియర్ నటుడు చంద్రమౌళి కన్నుమూత..!

By iQlikMovies - April 05, 2018 - 16:07 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు సినీ పరిశ్రమకి చెందిన సీనియర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రమౌళి ఈరోజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ హీరో మోహన్ బాబు తండ్రి నారాయణ స్వామి గారు చంద్రమౌళి కి గురువు. ఈయన 1971 లో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి రంగప్రవేశం చేసారు. సుమారు 45 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీ లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించారు.

తెలుగులో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, నాగేశ్వర రావు లాంటి నటులే కాకుండా నేటి అగ్రహీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు పోషించారు.

మా iQlikMovies.com తరపున చంద్రమౌళి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS