వంశీ పైడిపల్లి ఇంట్లో పలువురు డైరెక్టర్లు మీట్ అయ్యారు. జక్కన్న రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, సందీప్‌రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ తదితరులు వంశీ పైడిపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. ఇదొక ఫ్రెండ్లీ మీటింగ్. తెల్లవారుజామున 4 గంటల వరకూ పలు విషయాలపై సరదా సరదాగా ముచ్చటించుకున్నారు.
కొరటాల శివ, హరీష్ శంకర్ కొన్ని కథల్ని కొన్ని లైన్స్‌ని ఈ సందర్భంగా ప్రస్థావించారట. అందరూ క్రియేటివ్ డైరెక్టర్లే. తమ తమ అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు పంచుకున్నారట. ఇంతమంది దర్శకులు ఒక్కచోట సమావేశమై చర్చించుకోవడమంటే, చాలా ప్రత్యేకమైన విషయంగా పరిగణించాలి. ఇటీవల కాలంలో హీరోలు ఒకరితో ఒకరు సరదాగా కలుస్తున్నారు. ఇప్పుడు దర్శకులు అదే రూటులో పయనిస్తున్నారు.
నిజానికి క్రియేటివ్ ఫీల్డ్‌లో క్రియేటివ్ పోటీ మాత్రమే ఉంటుంది. దురదృష్టవశాత్తూ, అభిమానులే హద్దులు మీరుతుంటారు. ఇండస్ట్రీపై ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారు. అలాంటి విషయాలపై మీడియాలో హైప్ క్రియేట్ కావడం సహజమే. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో చాలా వివాదాలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఐక్యతను కోరుకుంటోంది. నటులు, టెక్నీషియన్లు, విభాగాల వారీగా ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది.
దర్శకుల మీటింగ్ విషయానికి వస్తే, తెలుగు సినిమా, కొత్త ఉత్సాహంతో ప్రపంచం అంతుల్ని చూడాలంటే, క్రియేటివ్ పీక్స్ చూడాలంటే, ఒకరి అభిప్రాయాలు, ఇంకొకరితో పంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రియేటివ్ డైరెక్టర్స్, తెలుగు సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారనీ మనస్పూర్తిగా ఆకాంక్షిద్దాం.