సినిమా తీయడానికి దర్శక-నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత అవసరమో తరువాత ఆ చిత్రాన్ని మీడియాకి, సామాన్య ప్రజానీకానికి దగ్గర చేసే భాగంలో ముఖ్య పాత్ర పోషించేది పీఆర్వో వ్యవస్థ.
ఇటువంటి పీఆర్వో వ్యవస్థ ఇప్పటివరకు తెలుగు చిత్రసీమకి సంబంధించి ఒక పటిష్టమైన వ్యవస్థ లేదని భావించిన పీఆర్వోలు. తమకంటూ ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకుని అందులో సభ్యత్వం ఉన్న వారికే మాత్రమే గుర్తింపు పొందిన పీఆర్వోలు గా పరిగణించాలని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ అంశాల మీద నిన్న సమావేశమైన పీఆర్వోలు తమకి ఉన్న సమస్యల పైన చర్చించుకుని ఒక కార్యాచరణకి శ్రీకారం చుట్టారట. అందులో కొన్ని కీలక నిర్ణయాలానే వారు తీసుకోవడం జరిగిందట. అందులో ముఖ్యమైనవి- ఎవరైనా పీఆర్వో అవ్వాలంటే ప్రస్తుతం గుర్తింపు పొందిన ఒక పీఆర్వో దగ్గర కనీసం 10 సినిమాలకి సహాయకుడిగా పనిచేసి ఉండాలి ఆ తరువాత సొంతంగా మరో 5 సినిమాలకి పీఆర్వోగా చేసిన అనుభవం ఉండాలట.
ఈ పైన వాటికి లోబడే భవిష్యత్తులో పీఆర్వో గుర్తింపు కార్డ్ అందచేయాలని ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారట. ఇక ఇదే సమయంలో ఒక మూడు వెబ్ సైట్స్ కి కూడా తమ వైపు నుండి సినిమాలకి సంబందించి ఎటువంటి సమాచారం ఇవ్వకూడదు అన్న కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.
అయితే వీటన్నిటి పైన అధికారికంగా ఒక ప్రకటన వెలువడాల్సి ఉంది.