సిద్ధార్థ్ పైన ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

మరిన్ని వార్తలు

హీరో సిద్దార్థ్ నిన్న చేసిన కొన్ని ట్వీట్స్ తో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేశాడు. అయితే ఆ వార్తల్లోకి ఎక్కడం కూడా వేరే హీరో అభిమానులతో వివాదం కారణంగా కావడంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయి కూర్చుంది.

ఇంతకి ఆ ట్వీట్ ఏంటంటే- ప్రభాస్ పుట్టినరోజుకి సరిగ్గా 100 రోజులు ఉంది అని ఆయన అభిమానులు ట్విట్టర్ లో ఈ  హ్యాష్ ట్యాగ్ తో #100DaysToKingPRABHASBday తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక దీని పైన సిద్దార్థ్ స్పందిస్తూ- ఇప్పటి నుండే వచ్చే సంవత్సరం పుట్టినరోజు కి కూడా హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయండి అంటూ ఇలా పెట్టి #465DayToKingPRABHASNextBdayAfterThisOne వారికి సెటైర్ వేసాడు.

దీనికి వెంటనే స్పందించిన ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధార్థ్ ని ట్యాగ్ చేస్తూ- #jokerofthedaysiddharth అంటూ ఆయనని ట్రోల్ చేశారు. ఇక దీనికి దిద్దుబాటు చర్యగా నేను చాలా సరదాగా అన్నాను అని అయిన ప్రభాస్ అంటే తనకి మంచి సాన్నిహిత్యం ఉందని అందుకే అలా ట్వీట్ చేశాను అని వివరణ ఇచ్చాడు.

ఏదేమైనా.. ప్రభాస్ పుట్టినరోజు సిద్ధుకి బ్యాడ్ గా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS