తెలుగు చలనచిత్ర పరిశ్రమ హెచ్చరిక

మరిన్ని వార్తలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ళ పైన ఈ మధ్యనే ఒక ప్రముఖ ఛానల్ చర్చా వేదికలో ఒక యాంకర్ అసభ్యకరమైన & అభ్యంతరకరమైన పదం వాడడంతో తీవ్ర దుమారం రేగింది.

ఈ అంశం పైన నిన్న యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒకే వేదిక పైకి వచ్చి ఈ అంశాన్ని అలాగే సదరు యాంకర్ వాడిన పదజాలాన్ని అందరు ఖండించారు. అలాగే తమ పని తాము చేసుకుంటుంటే అనవసరంగా మమ్మల్ని తమకి సంబంధం లేని అంశాల్లోకి లాగడం ద్వారా తమ పరువు తీయొద్దు అని విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి భవిష్యత్తులో గనుక చులకనగా మాట్లాడితే తమ నుండి కూడా ఊహించని విధంగా సమాధానం ఉంటుంది అని హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులందరూ హజరయ్యారు.

 

ఇక ఈ ప్రెస్ మీట్ తరువాత రాబోయేకాలంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని వారు కోరుకున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS