శ్రీ రెడ్డి కి తేజ బంఫర్ ఆఫర్.. మరి బాలయ్య ఒప్పుకుంటాడా..?

By iQlikMovies - March 28, 2018 - 12:20 PM IST

మరిన్ని వార్తలు

నటి శ్రీ రెడ్డి కి నిన్న దర్శకుడు తేజ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె గత కొన్ని రోజులుగా పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనని ఇండస్ట్రీ లో అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని చెబుతూ వచ్చింది.

దీనితో ఈమె పరిస్థితిని గమనించిన ప్రముఖ దర్శకుడు తేజ ఆమెని పిలిపించి, ఆయన చేయనున్న రెండు చిత్రాలలో మంచి పాత్రలు ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇదే విషయాన్నీ ఆయన స్వయంగా వీడియో బైట్ ద్వారా అందరితో పంచుకున్నాడు. అయితే ఇప్పుడు తేజ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి, అందులో ఒకటి NTR బయోపిక్ మరొకటి వెంకటేష్ చిత్రం.

ఇప్పుడు NTR బయోపిక్ లో శ్రీ రెడ్డి కి ఎటువంటి పాత్ర ఇస్తాడు తేజ? అసలే ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా బాలయ్య తెరకెక్కించబోతున్నాడు అని అందరికీ తెలిసిందే. మరి ఇంతటి పెద్ద సినిమాలో నటనాపరంగా అంతగా అనుభవంలేని శ్రీ రెడ్డికి ఏ పాత్ర ఇస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తున్నది.

సినిమా విషయంలో చాలా కచ్చితంగా ఉండే బాలకృష్ణ, దర్శకుడు తేజ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్దిస్తాడా లేదా విభేదిస్తాడా అన్నది తెలియాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS