ఈ దసరా మాములుగా ఉండదు!!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ కి దసరా బిగ్గెస్ట్ సీజన్. కనీసం ఓ రెండు పెద్ద సినిమాలు, మరో రెండు మీడియం సినిమాలు దసరా బరిలో దిగడం రివాజు. ఈ ఏడాది దసరా కూడా సినిమా సందడి గట్టిగానే వుండబోతుంది. ఇప్పటికే దసరా సీజన్ బెర్తులు ఖారారు చేసుకున్నాయి కొన్ని సినిమాలు. బోయపాటి రామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అక్టోబర్ 20న అని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా వదిలారు.

 

మాస్ మహారాజా కూడా దసరా బరిలోనే దిగుతున్నారు. ఆయన చేస్తున్న బయోపిక్ టైగర్ నాగేశ్వర్ రావు కూడా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది. బాలకృష్ణ కూడా దసరా బరిలోనే దిగుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా అక్టోబర్ 21 న విడుదల కాబోతుందని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే దీని విడుదల తేది అనౌన్స్ చేస్తారు. ఇక డబ్బింగ్ సినిమాగా విజయ్ లియో కూడా దసరాలోనే వచ్చే అవకాశం వుంది. మొత్తానికి అప్పుడే దసరా బెర్తులు ఖారరైపోయాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS