ప్రభాస్ కోసం పానిండియా హీరోలు రారా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ తో సౌత్ ఆడియన్స్, ప్రబాస్ ఫాన్స్  మండిపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్పనటుడిని, పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటిన హీరోని ఒక సాదా సీదా క్యారక్టర్ ఆర్టిస్ట్ జోకర్ అని విమర్శించటం పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. కల్కి ఇండియన్ సినిమా మార్కెట్ ని పెంచింది. 1200 గ్రాస్ కలక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ప్రభాస్ కూడా ఒక కారణం. 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్' అన్న డార్లింగ్ డైలాగే దీనికి నిదర్శనం. కేవలం ప్రభాస్ మీద ఉన్న క్రేజ్ తోనే కల్కి వసూళ్లు సాధ్యమయ్యింది. అలాంటి ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందని మాట్లాడి  అర్షద్ ఫేమస్ అయిపోయాడు. ఈ వివాదం సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టు కొనసాగుతున్నా  ఇప్పటికీ అర్షద్ సారీ చెప్పకపోవటం గమనార్హం.   


మన హీరోని  అంటే ఊరుకుంటామా, ఇంకా ఎన్నాళ్ళు బాలీవుడ్ అహంకారం భరించాలని కొందరు హీరోలు గట్టిగా సమాధానం చెప్పారు. సుధీర్ బాబు, నాని , సిద్దు జొన్నలగడ్డ, శర్వా  నంద్, దిల్ రాజు లాంటి వారు అర్షద్ కేవలం పబ్లిసిటీ కోసమే ప్రభాస్ ని విమర్శిస్తున్నాడని, ఈ మాటలతో కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నాడని సెటైర్లు వేశారు. నార్త్ ఆడియన్స్ అర్షద్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే అర్షద్ ని విమర్శించారో వారిని సొషల్మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు.      


టాలీవుడ్ లో టైర్ 2  హీరోలు రెస్పాండ్ అయ్యారు. కానీ పాన్ ఇండియా స్టార్స్, దర్శకులు , నిర్మాతలు ఎందుకు రెస్పాండ్ అవటం లేదని తెలుగు సినీప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నారు. కాకులకి ఉన్న యూనిటీ కూడా మనకి లేదని, తోటి హీరోని ఆఫ్ట్రాల్ ఒక కమెడియన్ విమర్శిస్తే అంతా కామ్ గా ఉన్నారని వాపోతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు, రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్‌ లాంటి బడా డైరెక్టర్లు ఎందుకు రియాక్ట్ అవడం లేదని సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలో వీరి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎందుకు కెలుక్కోవటం అని సైలెంట్ అయ్యారని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS