ప్రముఖ గాయని సునీత కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ''చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ షూటింగ్ కి వెళ్లినప్పుడు అనుకోకుండా తలనొప్పి వచ్చింది. తలనొప్పే కదా అని అనుకోకుండా టెస్ట్ చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ పాజిటీవ్ అని తేలింది. ఇప్పుడు కరోనా నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నా. అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఐసొలేషన్ లో ఉండి, బయటపడ్డా. ఇప్పుడు మా బెంగంతా బాలు గారి గురించే. నేను నా కుటుంబం నిశ్శబ్దంగా ప్రార్థిస్తున్నాం. ఆయన తొందరగా బయటకు రావాలని, ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా ఉండి. మనమంతా ఆయన గురించి ప్రార్థిద్దాం'' అన్నారామె.
మరో గాయని మాళవికకు సైతం కోరోనా సోకిందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నారు. అప్పుడే కరోనా సోకిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.