అయ్యప్పనుమ్ కోషియమ్.. రీమేక్ చేతులు మారీ మారీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చేతికి చిక్కింది. ఈ సినిమాని పవన్ తో రీమేక్ చేయించాలన్న త్రివిక్రమ్ కోరిక ఫలిస్తోంది. ఈసినిమా రీమేక్ హక్కుల్ని ఎప్పుడో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేజిక్కించుకుంది. అప్పటి నుంచీ ఈ కథ హీరోల చుట్టూ తిరుగుతూనే వుంది. చివరికి రవితేజ, రానా కలిసి ఈ రీమేక్ లో నటిస్తారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ కథ పవన్ చేతికి చేరింది.
ఇటీవల ఈ సినిమా చూసిన పవన్ రీమేక్ లో నటించడానికి సిద్ధమయ్యాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. `రంగ్ దే` దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని టాక్. రానా చేయాల్సిన పాత్రలో.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తాడట. త్రివిక్రమ్ సైతం ఈ చిత్రానికి ఒకానొక నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పుకుంటున్నారు. సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.