బికినీలోనో టాప్‌లెస్‌లోనో ఏముంది సెక్సప్పీల్? ఇదిగో, నా కళ్ళలోకి చూడండి, సెక్సప్పీల్ అంటే ఏంటో తెలుస్తుందన్నట్లుంది ఈ ఫొటో. లక్ష్మీరాయ్ త్వరలో 'జూలీ-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌లో లక్ష్మీరాయ్ చేస్తోన్న ఫుల్ లెంగ్త్ సినిమా ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన అంద చందాలతో అలరించిన లక్ష్మీరాయ్, బాలీవుడ్ తెరపై హీటెక్కించేందుకు రెడీ అయిపోయింది. 'జూలీ-2' స్టిల్స్ ఒక్కొక్కటీ లీక్ చేస్తూ కిర్రాకు పుట్టిస్తోన్న లక్ష్మీరాయ్, హాటెక్కించే ఫొటోలే కాదు, తన చూపుల్తోనూ సెక్సప్పీల్ పండించేసే ఇలాంటి ఫొటోల్నీ షేర్ చేస్తోంది. లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ ఎలాగైనా సెక్సప్పీల్ పండించగలదు. అదే ఆమె ప్రత్యేకత.