ఈ రోజుల్లో హిట్ టాక్ వచ్చినంత మాత్రన నిర్మాత లాభాల్లో ఉన్నట్టు కాదు. సినిమా బాగున్నా- నిర్మాతలు నష్టపోతున్న సమయం ఇది. ఓవర్ బడ్జెట్లే ఇందుకు కారణం. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా సరే - నిర్మాతలకు లాభాలు మిగల్చాలంటే పర్‌ఫెక్ట్ ప్లానింగ్ అవసరం. ఆ ప్లానింగ్‌తో పూర్తయిన సినిమా `తెనాలి రామకృష్ణ బిఏబిఎల్` సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. హన్సిక నాయిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ
సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో నిర్మాతలు నష్టపోతారేమో అనిపించింది. కానీ.. ఈ సినిమాతో నిర్మాతలు కొంత లాభాన్నీ మిగుల్చుకున్నారు. 5.5 కోట్లతో సినిమా పూర్తయింది. శాటిలైట్, డిటిటల్ రూపంలో 3 కోట్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్‌ల రూపంలో మరో 1.75 కోట్లు వచ్చాయి. థియేటరికల్ రైట్స్ రూపంలో మరో 2 కోట్లు వచ్చాయి. అంటే 6.75 కోట్ల వ్యాపారం జరిగిందన్నమాట. సో... బాక్సాఫీసు లెక్కల ప్రకారం దీన్ని కూడా హిట్టు బొమ్మే అనుకోవచ్చు.