మంత్రి గంటా శ్రీనివాసరావు కుమరుడు హీరోగా నటించిన గంటా రవితేజ చిత్రం జయదేవ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అయితే దురదృష్టవశాత్తూ ఈ చిత్రం ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన నర్సీపట్నంలోని రాజు ధియేటర్ వద్ద జయదేవ్ పోస్టర్లను చించివేశారు.
దీనితో ఒక్కసారిగా ధియేటర్ వద్ద గంటా అభిమానులు గుమిగూడడంతో పోలీసులు వెంటనే బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ పని కేవలం రాజకీయ కోణంలోనే జరిగిందని పోలీసులు అబిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.