ఫస్ట్‌ సింగిల్‌ కోసం ఎదురు చూస్తున్నా: థమన్‌

మరిన్ని వార్తలు

ఆడియో కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తుంటారు. కానీ, ఇక్కడ మన మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎదురు చూడడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ థమన్‌ ఎదురు చూస్తున్న ఆ ఫస్ట్‌ సింగిల్‌ ఏ సినిమాలోదో తెలుసా.? పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ ‘పింక్‌’ రీమేక్‌లోనిది. ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌.థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. రేపు అనగా ఫిబ్రవరి 28న ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నారట. ఈ సింగిల్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌కి ఓ బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌గా ఎదురు చూస్తున్నాడట థమన్‌. ఈ సినిమాలో మ్యూజిక్‌ కోసం, థమన్‌ చాలా ఎక్కువగానే చెబుతున్నాడు. మ్యూజిక్‌ కోసం కాదు, పవన్‌ కళ్యాణ్‌ కోసం. ఈ ఆఫర్‌ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నాడు థమన్‌.

ఈ మధ్య మ్యూజిక్‌ డైరక్టర్‌గా ఎక్కడ విన్నా థమన్‌ పేరే మార్మోగిపోతోంది. ‘అల వైకుంఠపురములో..’ సినిమా మ్యూజికల్‌ హిట్‌తో థమన్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అయినా, పవన్‌ సినిమాకి తనకి దక్కిన ఆఫర్‌ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. నిజానికి ‘పింక్‌’ ఒరిజినల్‌లో పాటలుండవు. కానీ, తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి కమర్షియల్‌ వాల్యూస్ యాడ్‌ చేయడంతో పాటలు కూడా మిక్స్‌ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా మాదిరి, ఈ సినిమాలోనూ ఐదు పాటుండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, నిజంగానే ఐదు పాటున్నాయో లేదో తెలీదు కానీ, థమన్‌ మ్యూజిక్‌ సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళుతుండనడం అతిశయోక్తి కాదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS