ప్ర‌భాస్ తో పాతాళ భైర‌వి

By Gowthami - February 27, 2020 - 08:28 AM IST

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ - నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు. ఈ సినిమా కోసం 200 నుంచి 250 కోట్ల బ‌డ్జెట్ కేటాయించార‌ని తెలుస్తోంది. పైగా జోన‌ర్ కూడా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ట‌. ఈ సినిమా జాన‌ప‌ద క‌థా చిత్ర‌మ‌ని తెలుస్తోంది. క‌త్తి యుద్ధాలు, మాయ‌లు, మంత్రాల‌తో సాగ‌బోతోంద‌ట‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే పాతాళ భైర‌విలా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌హాన‌టి త‌ర‌వాతి నుంచే ఈ క‌థ‌పై నాగ అశ్విన్ క‌స‌ర‌త్తులు ప్రారంభ‌మ‌య్యాయి.

 

ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తీయాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. అందుకు త‌గిన హీరో ప్ర‌భాస్ మాత్ర‌మే. నెల రోజుల క్రిత‌మే ప్ర‌భాస్‌ని క‌లిసిన అశ్విన్ ఈ క‌థ వినిపించారు. అది న‌చ్చ‌డంతో సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాని ఓకే చేశారు. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్ల పండ‌గ చేసుకోబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ భారీ చిత్రాన్ని తీసుకురావాల‌న్న‌ది వాళ్ల ప్లాన్‌. అందులో భాగంగానే ప్ర‌భాస్ - అశ్విన్ సినిమా సెట్ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS