తమన్ మ్యూజిక్ అంటేనే మాస్. ఇప్పుడు ఆయన మాంచి ఫామ్ లో వున్నాడు. పెద్ద సినిమాలన్నీ ఆయన చేతిలోనే స్వరాలు అద్దుకుంటున్నాయి. అదే సమయంలో మీడియం రేంజ్ సినిమాలకు కూడా తమనే ఫస్ట్ ఆప్షన్. శివకార్తికేయన్, అనుదీప్ ల 'ప్రిన్స్' సినిమాకి సంగీతం అందిస్తునాడు తమన్. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి'' పాట విడుదలైయింది. ఇందులో డ్యాన్స్ బీట్ అదరగొట్టాడు తమన్. ట్యూన్ చాలా క్యాచిగా వుంది. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా బావున్నాయి.
రామ్ మిరియాల, రమ్య బెహరా పాటని ఎనర్జిటిక్ గా పాడారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పాట థియేటర్లో హంగామా చేయడం ఖాయం అనిపిస్తోంది. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అనుదీప్ తన శైలిలో హిలేరియస్ లవ్ స్టొరీగా ప్రిన్స్ ని తీర్చిదిద్దుతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు వస్తోంది.