చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్ 'ఆచార్య'. కొరటాల శివ దర్సకత్వంలో రామ్ చరణ్ తో కలసి చేసిన ఆచార్య చాలా దారుణమైన ఫలితం చవిచూసింది. పట్టుపని మది రోజులు కూడా సినిమా నిలవలేకపోయింది. అయితే ఈ అపజయంపై 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చాలా హుందాగా స్పందించారు చిరు. ప్రేక్షకులు థియేటర్ లోకి రావడం లేదనే అంశం గురించి మాట్లాడుతూ 'ఆచార్య' ఊదాహరణ తీసుకొచ్చారు.
''ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే మాటలు అపోహ మాత్రమే. ఆడియన్స్ సినిమాలను ఓటీటీలో చూస్తున్నా, యూట్యూబ్‌లో వీక్షిస్తున్నా.. సరే థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే వారు తప్పకుండా థియేటర్లకు వస్తారు. ఇటీవల విడుదలైన సినిమాలు ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ అలా వచ్చినవే. కంటెంట్ బాగుంటే తప్పకుండా వస్తారు లేదంటే రెండో రోజే సినిమా పోతుంది.
ఈ మధ్య నాకు అలానే జరిగింది. ఆ విషయంలో నేనూ బాధితుణ్నే'' అని చాలా హుందాగా వాస్తవాన్ని అంగీకరించారు చిరు.