ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. తమన్ పేరే చెబుతారంతా. తను చేసిన ప్రతీ సినిమా హిట్టే. మరీ ముఖ్యంగా ఆర్.ఆర్.లో విజృంభిస్తున్నాడు. ఇటీవల అఖండ కోసం తమన్ ఇచ్చిన ఆర్.ఆర్... టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈసినిమాకి రెండో హీరో తమనే అని.. తమన్ ఇచ్చిన ఆర్.ఆర్ వల్లే ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని విశ్లేషకులు చెప్పేశారు. దాంతో.. తమన్ రేంజ్ ఇంకా పెరిగిపోయింది. అఖండ తరవాత తమన్ తన పారితోషికం కూడా పెంచేశాడట. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. అది కూడా కథ, దర్శకుడు నచ్చితేనే చేస్తా అని నిర్మొహమాటంగా చెబుతున్నాడట.
అయితే తమన్ తొలి పారితోషికం ఎంతో తెలుసా? రూ.30. అవును. ఇది నిజం. భైరవ ద్వీపం సినిమాకి తమన్ డ్రమ్మర్ గా పని చేశాడు. ఆ సినిమాకి తను అందుకున్న పారితోషికం రూ.30 మాత్రమే. ఇప్పుడు బాలయ్య సినిమాతోనే రూ.3 కోట్లకు ఎదిగాడు. అదే కదా సక్సెస్ అంటే. అయితే తమన్ వెనుక.. చాలా దారుణ మైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓసారి తాతయ్య ఇంటికి వెళ్లి వస్తుండగా, నాన్నకి గుండె పోటు రావడంతో ఆయన చనిపోయార్ట. ఎల్.ఐ.సీ పాలసీ ల రూపంలో రూ.60 వేలు చేతికి అందితే, ఆ డబ్బుతోనే తమన్ డ్రమ్స్ కొనుక్కున్నాడట. ఆ డ్రమ్స్ ద్వారానే ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు తమన్. అంత కష్టపడ్డాడు కాబట్టే, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు.