లూసిఫర్ పాటలకు అవకాశం లేని సినిమా. అలాగే నేపధ్య సంగీతం కూడా అంత గ్రాండ్ ఏమీ వుండదు. అయితే గాడ్ ఫాదర్ లో మాత్రం మ్యూజిక్ ని తీసుకొచ్చారు. నజభజజజరా, థార్ మార్ పాటలతో పాటు నేపధ్యం సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశాడు తమన్. యాక్షన్ సీక్వెన్స్ లో తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం అందరినీ ఆకట్టుకుంది. అయితే మెగాస్టార్ సినిమా అంటే డ్యాన్స్, పాటలు. తమన్ కి మాత్రం సరైన డ్యాన్స్ పాటలు చేసే అవకాశం ఇవ్వలేదు గాడ్ ఫాదర్. ఈ విషయంలో చిన్న అసంతృప్తి వుందని అంటున్నారు తమన్.
''లూసిఫర్ లో మ్యూజిక్ గుర్తుండదు. కానీ గాడ్ ఫాదర్ లో గుర్తుండే మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా వుంది. అయితే మెగాస్టార్ అంటే ఫుట్ ట్యాపింగ్ నెంబర్స్, సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్స్ వుండే పాటలు. కానీ గాడ్ ఫాదర్ లో అలాంటి పాటలు చేసే అవకాశం లేదు. ఈ విషయంలో కొంత అసంతృప్తి వుంది. నా ఆకలి తీరలేదు. మెగాస్టార్ కి మరో సినిమా అడిగా. తప్పకుండా ఇస్తానని చెప్పారు. ఇకపై ఆయనతో చేయబోయే సినిమాల్లో ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే డ్యాన్స్ నెంబర్స్ చేస్తా'' అని చెప్పుకొచ్చారు తమన్