ఎప్పుడూ కూల్‌గా ఉండే తమన్‌కి తొలిసారి కోపం వచ్చింది. `వాడు కనిపిస్తే కొట్టేస్తా` అంటూ ఫైర్ అయిపోతున్నాడు. `వాడు క్రిమినల్ నా కొడుకు` అంటూ.. తన కోపాన్ని చూపిస్తున్నాడు.
ఈ కోపానికీ ఓ అర్థం ఉంది. `అరవింద సమేత వీర రాఘవ`కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీకైన సంగతి తెలిసిందే. అలా లీకేజీకి కారణమైన వాళ్లపైనే తమన్ కోపమంతా. ``ఎన్టీఆర్ చాలా కష్టపడి చేసిన సీన్ అది. 50 డిగ్రీల ఎండలో, చమటలో కష్టపడ్డాడు. అలాంటి సీన్‌ని లీక్ చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. వాడో క్రిమినల్ నా కొడుకు. వాడు కనిపిస్తే తప్పకుండా కొట్టేస్తా`` అంటూ సీరియస్ అయిపోయాడు.
ఓ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో తాను కళ్లారా చూశానని, సిక్స్‌ప్యాక్ కోసం ఎన్టీఆర్ పద కొండు రోజుల పాటు కేవలం నీళ్లు తాగి గడిపాడని, అలాంటి కష్టాన్ని సైతం పట్టించుకోకుండా ఇలా లీకులు చేసేవాళ్లని ఊరికే వదలకూడదని గట్టిగా చెప్పుకొచ్చాడు తమన్. అరవింద సమేత వీర రాఘవకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇందులో పాటలకు మంచి స్పందన వస్తోంది. ఎన్టీఆర్ కూడా `తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు` అని కితాబులు ఇచ్చేశాడు.
ఈ ఆల్బమ్‌లో `పెనివిటీ` పాటకు మంచి స్పందన వస్తోంది. తమన్ రీ రికార్డింగ్ కూడా అదరగొట్టేశాడని టాక్.