యంగ్‌ టైగర్‌ 100 కోట్లు కన్‌ఫామ్‌?

మరిన్ని వార్తలు

'అరవింద సమేత'కి లైన్‌ క్లియర్‌ అయ్యింది. 'నోటా' హిట్‌ అయి వుంటే, ఆ ఇంపాక్ట్‌ గట్టిగానే పడేది ఈ సినిమాపై. సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ అభిమానులు రెండ్రోజులుగా పెద్ద యుద్ధమే చేసుకున్నారు. 

అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'నోటా'కి నెగెటివ్‌ టాక్‌ వచ్చేసింది. దాంతో 'అరవింద సమేత'పై అంచనాలు డబుల్‌ అయిపోయాయి. దసరా సీజన్‌ చాలా పెద్ద ప్లస్‌. 18న విజయదశమి. 11న సినిమా రిలీజ్‌ సో 'అరవింద సమేత..'కి వసూళ్ళ పండగే పండగ. తొలిసారి యంగ్‌ టైగర్‌ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరబోతుందని ఆయన అభిమానుల గట్టి నమ్మకంతో ఉన్నారు. 

ఇటీవల జరిగిన 'అరవింద సమేత..' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ అభిమానుల్ని కదిలించేసింది. ఆ స్థాయిలో ఎన్టీఆర్‌ని ఎప్పుడూ ఎమోషనల్‌ యాంగిల్‌లో చూసింది లేదు. సో ఆ ఎమోషన్‌తో ఎన్టీఆర్‌కి అపారమైన సింపథీ కూడా తోడయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చిన 'నోటా' రిజల్ట్‌ రివర్స్‌ అవ్వడం, ఎన్టీఆర్‌కి బాగా కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. ఆ రకంగా ఓ లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇంకో రకంగా సింపథీ తోడయ్యింది. అన్నీ వెరసి ఎన్టీఆర్‌ రూపంలో త్రివిక్రమ్‌కి 'అరవింద సమేత..' మంచి సక్సెస్‌ ఇస్తుందనీ ఇటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, అటు త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే, సినిమాలో సత్తా వుంటేనే కదా.. అది సాధ్యమవుతుంది. భారీ బడ్జెట్‌తో హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS