పవన్ సినిమా పని మొదలుపెట్టిన థమన్

By iQlikMovies - August 13, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కరోనా క్రైసిస్ కారణంగా వాయిదా పడింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు, పెండింగ్ పోర్షన్ పూర్తి చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే ఆ లోపే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారని సమాచారం అందుతోంది. సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు సంబంధించిన నేపథ్య సంగీతం, రీ-రికార్డింగ్ కార్యక్రమాలను ఈరోజు మొదలుపెట్టారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'మగువా ఓ మగువా' అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇక ఈ సినిమాలో మిగతా పాటలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

హిందీలో లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS