త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా ఉందా, లేదా?

By iQlikMovies - July 17, 2021 - 17:58 PM IST

మరిన్ని వార్తలు

ఈ న‌గ‌రానికి ఏమైంది? త‌ర‌వాత త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రాలేదు. అయితే.. వెంక‌టేష్ తో ఓ సినిమా చేయాల‌ని త‌రుణ్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. ఓ క‌థ చెప్పి ఒప్పించాడు కూడా. అది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ‌. ఈ క‌థ వెంకీ ఓకే అన్నా.. చివ‌రి క్ష‌ణాల్లో ఆగిపోయింది. `వెంకీతో త్వ‌ర‌లోనే సినిమా చేస్తా..` అని త‌రుణ్ భాస్క‌ర్‌... `త‌రుణ్ తో నా సినిమా ఉంది` అని వెంక‌టేష్ చెబుతూనే ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి సూచ‌న‌లు ఏమీ క‌నిపించ లేదు. ఇప్పుడు ఈ సినిమా మ‌రింత ఆల‌స్యం అయ్యే ఛాన్సుంది. ఈ విష‌యాన్ని కూడా వెంకీనే చెప్పాడు.

 

``త‌రుణ్ భాస్క‌ర్ తో ఓ సినిమా చేయాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ క‌థ చెప్పాడు. అది వర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు మ‌రో క‌థ రెడీ చేస్తున్నాడు. క‌థ న‌చ్చితే.. వెంట‌నే చేసేస్తా`` అన్నాడు వెంకీ. త్రివిక్ర‌మ్ ప్రాజెక్టుపైనా వెంకీ ఇలానే స్పందించాడు. ``త్రివిక్ర‌మ్ తో చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా. కానీ కుద‌ర‌డం లేదు. మా ఇద్ద‌రికీ స‌మ‌స్య క‌థ మాత్ర‌మే. స‌రైన క‌థ ఎప్పుడు కుదుతుందో అప్పుడే మా సినిమా ఉంటుంద‌``న్నాడు వెంకీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS