తరుణ్‌ భాస్కర్‌ కామ్‌గా పని కానిచ్చేస్తున్నాడు!

By Inkmantra - January 10, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్‌గా పాపులర్‌ అయిన తరుణ్‌ భాస్కర్‌ 'పెళ్లి చూపులు' సినిమా తెరకెక్కించి రాత్రికి రాత్రే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రీసెంట్‌గా విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన యాక్టింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. దాంతో హీరో థాట్స్‌ పక్కన పెట్టేసి, మళ్లీ డైరెక్టర్‌ పగ్గాలే చేపట్టాడు తరుణ్‌ భాస్కర్‌. కూర్చొని కామ్‌గా స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కథని వెంకటేష్‌కి వినిపించాడు.

 

Also Read ర‌జ‌నీ పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు.

 

తరుణ్‌ చెప్పిన కథ వెంకీకి బాగా నచ్చిందట. డెవలప్‌ చేయమని కాస్త టైమ్‌ ఇచ్చాడట. ఈ టైమ్‌లో వెంకీ 'అసురన్‌' రీమేక్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈలోగా మన డైరెక్టర్‌ కమ్‌ హీరోగారు ఇంకో పని కూడా చేసేశారు. తనకు కొట్టిన పిండి అయిన వెబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కామ్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ని డైరెక్ట్‌ చేసేశాడు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సిరీస్‌ అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రసారం కానుందట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS