'పెళ్లిచూపులు' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో ఈ యంగ్ డైరెక్టర్‌కి ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే క్రేజ్‌తో వరుసగా ఏదో ఒక సినిమా చేసేయాలనే తొందరపాటు లేకుండా, ఆచి తూచి ఓ సినిమా తెరకెక్కించాడు. అదే 'ఈ నగరానికి ఏమైంది'. 'పెళ్లిచూపులు' సినిమా ఎఫెక్ట్‌తో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు సింగిల్ లైన్‌లోనేఈ సినిమాని నిర్మించేందుకు ఒప్పేసుకున్నారట.
ఈ తరం యూత్ పల్స్‌ని బాగా పట్టేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సినిమాని సినిమాగా కాకుండా, మనింటి స్టోరీలా నేచురల్‌గా చూపించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు యూత్‌కి అంత బాగా కనెక్ట్ అవుతాయి. కొత్త వాళ్లే అయినా కత్తి లాంటోల్ని ఎంచుకుంటాడు నటనకు. ఎంతో అనుభవం ఉన్న నటుల్లా కనిపిస్తారు తెరపై వారు. 'పెళ్లి చూపులు' సినిమాలోనూ అంతే.
ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది.?'లోనూ అంతే. ఏకంగా నలుగురు కుర్రాళ్లు. నలుగురూ కొత్తోళ్లే. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పోజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. ఇకపోతే ఈ క్యాచీ అండ్ క్లవర్ డైరెక్టర్ నెక్స్ట్ తీయబోయే సినిమా ఎవరితోనో తెలుసా? రానాతోనట. రానాకి యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే రానాతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తన తదుపరి చిత్రం ఉండబోతోందనీ సంకేతాలు పంపుతున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, త్వరలోనే తన కొత్త సినిమా వివరాలు చెబతానంటున్నాడు. యూత్ సెంట్రిక్ మూవీస్‌కే ఎక్కువ స్పేస్ ఇస్తాడు కాబట్టి తరుణ్ భాస్కర్ నుండి మరో మంచి సినిమా రానుందని ఎక్స్‌పెక్ట్ చేయచ్చన్నమాటే.!