నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను.. ఇలా వరుస విజయాలతో... దూసుకొచ్చాడు తరుణ్. ఆ తరవాత.. తన జాతకం తిరగబడింది. అన్నీ ఫ్లాపులే. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమా వేడుకల్లో, పార్టీలలో, ఫంక్షన్లలోనూ కనిపించడం లేదు. ఇప్పటికీ తరుణ్ బ్యాచిలరే. తరుణ్ పెళ్లి విషయంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవేం నిజం కాలేదు. ఇప్పుడు మళ్లీ తరుణ్ పెళ్లి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇంట్లో సంబంధం కూడా ఖాయం చేసేశారని సమాచారం. రోజా రమణి స్నేహితురాలి కుమార్తెని తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడన్నది వార్తల సారాంశం. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే. లాక్ డౌన్ సమయంలోనే చాలామంది సినీ సెలబ్రెటీల వివాహాలు సింపుల్ గా జరిగిపోయాయి. తరణ్ పెళ్లినీ అలానే ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అయితే ఈ విషయమై తరుణ్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సివుంది.