బన్నీ టోపీ డ్యాన్స్‌ అదరగొట్టేస్తున్నాడు

By iQlikMovies - May 01, 2018 - 17:34 PM IST

మరిన్ని వార్తలు

తన ప్రతీ సినిమాకి డాన్సుల్లో వైవిధ్యం చూపించాలనుకుంటాడు బన్నీ. అలాగే కొత్త కొత్త డాన్సుల్ని పరిచయం చేస్తుంటాడు. స్టైల్‌తో పాటు, స్టైలిష్‌ డాన్స్‌కీ బన్నీ పెట్టింది పేరు. అలాంటిది భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలోనూ బన్నీ తన డాన్స్‌తో మ్యాజిక్‌ చేసేశాడనిపిస్తోంది. మే 4న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ డాన్సింగ్‌ క్లిప్‌ రిలీజ్‌ చేశారు. 

ఇదేదో మామూలు డాన్స్‌ కాదు. గ్రాఫిక్స్‌ అంతకన్నా కాదు. రియల్‌ డాన్స్‌. ప్రోపర్టీస్‌ని యూజ్‌ చేసి డాన్సులు చాలా మంది చేస్తుంటారు. కానీ బన్నీ ఓ టోపీని యూజ్‌ చేసి, చేసిన మ్యాజిక్‌ చూస్తే వారెవ్వా అనాల్సిందే. టోపీతో ఇన్ని రకాల మ్యాజిక్‌లు చేయొచ్చా డాన్సులో అనిపించేలా బన్నీ చేసి చూపించేశాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. టీవీల్లో కూడా ఈ వీడియో క్లిప్‌ తెగ సందడి చేస్తోంది. టోపీతో ఇలా మ్యాజిక్‌ చేసేందుకు బన్నీ చాలా కష్టపడ్డాడట. 

షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ అవ్వగానే ఇలా టోపీతో ప్రాక్టీస్‌ చేసేవాడట. ఆడియో ఫంక్షన్‌లో నాగబాబు ఈ విషయం గురించే పర్టిక్లర్‌గా చెప్పారు. ప్రాక్టీస్‌ మేక్స్‌ మెన్స్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు కదా. అలా ప్రాక్టీస్‌ చేసి, చేసి, బన్నీ చేసిన ఈ క్యాప్‌ డాన్స్‌ ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందట. ప్రోమోస్‌లో జస్ట్‌ శాంపిల్‌కే చూపించారు. ఫుల్‌ సాంగ్‌లో ఇంకా చాలా చేశాడట బన్నీ. 

వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సైనికుడికి కోపమే కాదు, జోష్‌ కూడా ఎక్కువే అని ఈ సాంగ్‌ ప్రోమో ద్వారా తెలుస్తోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో బన్నీతో జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS