ఆస్కార్ అనగానే.. అందరి చూపూ నాటు నాటు పాటపైనే పడుతుంది. అది సహజం. అందరి అంచనాల్నీ నిజం చేస్తూ.. నాటు నాటు పాట ఆస్కార్ అందుకొంది. అభిమానుల్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. అయితే.. ఈసారి ఇండియాకు మరో ఆస్కార్ కూడా దక్కింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’కి అవార్డు ఆస్కార్ దక్కింది.
తమిళ భాషలో రూపొందించిన ఈ లఘు చిత్రం కార్తీక్, గునీత్ తెరకెక్కించారు. 41 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ఇది. కార్తీకి గోన్సాల్వేస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓ జంట.. రఘు అనే ఎఓ ఏనుగుని దత్తత తీసుకొంటారు. అయితే… ఆ ఏనుగుని పోషించలేక ఆపపోపాలు పడతారు. ఈ షార్ట్ ఫిల్మ్ కథ ఇదే. మనుషులకూ, ప్రకృతికీ, మూగ జీవాలకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని తెరపై హృద్యంగా ఆవిష్కరించారు. అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ దక్కింది. నాటు నాటు పాట కంటే.. ఈ షార్ట్ ఫిల్మ్ కే ముందు ఆస్కార్ ప్రకటించారు. ఈసారి భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ పొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ `ఆల్ దట్ బ్రీత్`కు మాత్రం నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో `నవానీ` అనే చిత్రానికి అవార్డు దక్కింది. `ఆల్ దట్ బ్రీత్`కీ అవార్డు వస్తే... ఆస్కార్ లో మన దేశం హ్యాట్రిక్ సాధించేది.