ఓ సాధారణ డైరెక్టర్. లో బడ్జెట్‌తో శర్వానంద్ లాంటి యంగ్ హీరోతో చేసిన సినిమా 'రన్ రాజా రన్'. చిన్న సినిమానే అయినా మంచి విజయం అందుకుంది. దాంతో ఈ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. అతడే సుజిత్. సుజిత్ ప్రస్తుతం చిన్న డైరెక్టర్ కాదు. ఓ స్టార్ హీరోతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అదే 'సాహో'. ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారుగానీ 'బాహుబలి' రాకతో, అంచనాలు పెరిగిపోయాయి. దాంతో బడ్జెట్ 100 కోట్లకు చేరుకుంది, ఇప్పుడది 150 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్దగా అనుభవం లేని ఓ యంగ్ డైరెక్టర్ ఇంత బడ్జెట్‌తో సినిమాని ఎలా డీల్ చేస్తాడు? అన్న డౌట్ ఎవరికీ లేదు. ఎందుకంటే 'సాహో'కి సంబంధించి బయటకొచ్చిన ఫస్ట్ లుక్ వీడియో అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి అందాల భామ శ్రద్ధాకపూర్‌ని ఇంపోర్ట్ చేశారు. ఆమెకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. హీరోయిన్‌కే అలా ఇస్తే, హీరోకి ఇంకెలా ఇవ్వాలి? అసలే 'బాహుబలి'. సో ప్రభాస్ రెమ్యునరేషన్ అదిరిపోయే రేంజ్‌లో ఉండనుంది. ఇప్పటికైతే సినిమా బడ్జెట్ 150 కోట్లని అంటున్నారు. సెట్స్ మీదకు వెళ్ళాక అది ఇంకెంతగా పెరిగిపోతుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే 'సాహో' జస్ట్ నాట్ తెలుగు సినిమా, ఇది కూడా ఇండియన్ సినిమానే. 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌కి వచ్చిన ఇమేజ్‌తో ఈ సినిమాను కూడా యూనివర్సల్‌గా విడుదల చేయాలనుకుంటోంది 'సాహో' టీమ్.