ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జై లవ కుశ'. ఈ సినిమా ఫస్ట్ టీజర్ విడుదలై ఇప్పటికే సెన్సేషన్ సృష్టిస్తోంటే, రెండో టీజర్‌కీ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. వినాయక చవితి రోజు 'జై లవకుశ' సినిమా రెండో టీజర్ విడుదల కానుంది. మొదటి టీజర్‌లో 'జై' పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. రావణుడి గెటప్‌ని మోడ్రన్ లుక్‌లో చూపించడంలో డైరెక్టర్ క్రియేటివిటీ చూపించాడు. భారీ డైలాగులు, యాక్షన్‌తో నాటి రావణుడి కన్నా ఈ రావణుడు చాలా కిరాతకుడు అని ఆ టీజర్‌లో చూపించారు. ఆ తర్వాత వచ్చిన 'లవ' పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్ చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంది. స్టైలిష్‌గా ఉన్నాడు ఆ పాత్రలో ఎన్టీఆర్. ఇక మిగిలిన 'కుశ' పాత్ర ఎలా ఉండబోతోంది అనేదే సర్వత్రా నెలకొన్న ఆశక్తి. ఈ పాత్ర సూపర్ ఫాస్ట్, అండ్ సూపర్ స్టైలిష్, అండ్ డాన్సులు అయితే అదరగొట్టేసేలా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. రావణుడిగా 'జై పాత్రను మించిన పవర్ ఈ పాత్రకు ఉండబోతోందట. అంటే విలన్‌కి తగ్గ హీరోయిజం ఈ క్యారెక్టర్‌లో ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పాత్ర గురించి తెలుసుకోవాలంటే అతి కొద్ది కాలం మాత్రమే వేచి చూడాలి. వినాయక చవితి నాడు ఎన్టీఆర్ తన అభిమానులకు ఇస్తున్న అపురూపమైన కానుక ఈ టీజర్ అని చెప్పాలి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.